Thanksgiving

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా

Intha Kaalam Needu Krupalo Kaachina Devaa

Watch on YouTube
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా - ఎన్ని తరాలు మారినా (2) మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం|| నీవు చేసిన మేలులు - తలచుకుందును అనుదినం (2) నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం|| దూరమైతిరి ఆప్తులు - విడచిపోతిరి నా హితులు (2) శోధన వేదన తీర్చిన యేసయ్యా తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2) ||ఇంత కాలం||