Wedding

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము

Iddarokkati Ga Maareti Madhuramaina Kshanamu

Watch on YouTube
ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2) వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2) ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి (2) హవ్వను చేసి జతపరచి - ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో - పాలించుమని నియమించెను (2) ||వివాహమన్నది|| ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2) సొంత తెలివిని మానుకొని - దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం - దేవుని కొరకై ప్రతి క్షణం (2) ||వివాహమన్నది|| భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ (2) క్రీస్తు ప్రేమను పంచాలి - సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని - తండ్రి రాజ్యముకు చేర్చాలి (2) ||వివాహమన్నది||