Easter

ఇదేనా న్యాయమిదియేనా

Idena Nyaayam Idiyena

Watch on YouTube
ఇదేనా న్యాయమిదియేనా కరుణామయుడు యేసు ప్రభుని - సిలువ వేయ ||ఇదేనా|| కుంటి వారికి కాళ్ళ నొసగే గ్రుడ్డి వారికి కళ్ళ నొసగే రోగుల నెల్ల బాగు పరిచే - ప్రేమ మీర ||ఇదేనా|| చెడుగు యూదులు చెరను బట్టి కొరడా దెబ్బలు కసిగా గొట్టి వీధులలోనికి ఈడ్చిరయ్యో - రక్తము కారన్ ||ఇదేనా|| మోయలేని సిలువ మోపి గాయములను ఎన్నో చేసి నడవలేని రాళ్ళ దారిన్ - నడిపిరయ్యో ||ఇదేనా|| ప్రాణముండగానే సిలువ కొయ్యకు మేకులెన్నో కొట్టిరయ్యో ప్రక్కలోనే బల్లెముతో - పొడిచిరయ్యో ||ఇదేనా|| ఎన్ని బాధలు పెట్టిన గాని మారు పల్కడు యేసు ప్రభువు ఎంత ప్రేమ ఎంత కరుణ - ఎంత జాలి ||ఇదేనా|| ఎన్ని మారులు పాపము చేసి యేసుని గాయముల్ రేపెదవేల నరక బాధ ఘోరమయ్యొ - గాంచవేల ||ఇదేనా||