Prayer

హీనమైన బ్రతుకు నాది ఘోర పాపిని

Heenamaina Brathuku Naadi Ghora Paapini

Watch on YouTube
హీనమైన బ్రతుకు నాది - ఘోర పాపిని (2) దాపు జేరితిని శరణు కోరితిని దిక్కు నీవే నాకు ఇలలో లేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన|| మనిషికి మమత ఉన్నందుకా - గుండె కోత మదిలో నిన్ను నింపుకున్నందుకా - విధి రాత (2) కరుణించి నన్ను కష్టాలు బాపు (2) కరుణామయా క్రీస్తేసువా ||హీనమైన|| తల్లి తండ్రి కన్న మిన్న - నీ మధుర ప్రేమ భార్య భర్తల కన్న మిన్న - మారని నీ ప్రేమ (2) పాపి కొరకు ప్రాణమర్పించిన (2) త్యాగ శీలివి నీకే స్తోత్రము ||హీనమైన|| నిన్న నేడు రేపు యేసు - మారనే మారవు లోకులంత మారిపోయిన - స్థిరమైన వాడవు (2) వెరువను జడియను (2) నీ కంటి పాపను నను కాచే దైవమా ||హీనమైన||