Worship

హా-మెలెక్‌ యేషువా నీకే వందనాలు

Ha-Malek Yeshua Neeke Vandhanaalu

Watch on YouTube
భూమ్యాకాశము సృజించెను - జీవముతో దానిని నింపెను తన హస్తముతో నిర్మించెను - జీవాత్మగా నన్ను నిలబెట్టెను మహిమ ఘనతకు అర్హుడవు - సైన్యములకు అధిపతి నీవే హా-మెలెక్‌ యేషువా నీకే వందనాలు (4) మమ్మేలు యేషువా వందనాలు - జగమేలు యేషువా వందనాలు (2) నా నిమిత్తం ప్రతిదండన చేయు - నా వైపున యుద్ధం చేయువాడవు (2) నా శత్రువుల చేతినుండి నన్ను - విడిపించు వాడవు నీవే (2) మహిమ ఘనతకు అర్హుడవు - సైన్యములకు అధిపతి నీవే ||హా-మెలెక్‌|| శ్రమలైనను ఎన్ని బాధలైనను - రోగమైనను ఎంత శోధనైనను (2) నాకు బలమైన కోటయు నీవే - నా బలిష్ట దుర్గము నీవే (2) మహిమ ఘనతకు అర్హుడవు - సైన్యములకు అధిపతి నీవే ||హా-మెలెక్‌||