Christmas
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
Dootha Paata Paadudi Rakshakun Sthuthinchudi
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను - సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున - మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
ఊర్ధ్వ లోకమందున - గొల్వగాను శుద్దులు
అంత్య కాలమందున - కన్య గర్భమందున
బుట్టినట్టి రక్షకా - ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా - నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
రావే నీతి సూర్యుడా - రావే దేవా పుత్రుడా
నీదు రాక వల్లను - లోక సౌఖ్య మాయెను
భూ నివాసులందరూ - మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి - ఆత్మ శుద్ది కల్గును
దూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
