Good Friday

దూరపు కొండపై శ్రమలకు గుర్తగు

Doorapu Kondapai Shramalaku Gurthagu

Watch on YouTube
దూరపు కొండపై శ్రమలకు గుర్తగు కౄరపు సిలువయే కనబడె పాపలోకమునకై ప్రాణము నొసగిన ప్రభుని సిలువను ప్రేమింతున్ ప్రియుని సిలువను ప్రేమింతున్ ప్రాణమున్నంత వరకును హత్తుకొనెదను సిలువను నిత్యకిరీటము పొందెదన్ లోకులు హేళన చేసిన సిలువ నా కెంతో అమూల్యమైనది కల్వరిగిరికి సిలువను మోయను క్రీస్తు మహిమను విడచెను ||ప్రియుని|| రక్తశిక్తమైన కల్వరి సిలువలో సౌందర్యంబును నే గాంచితిని నన్ను క్షమించను పెన్నుగ యేసుడు ఎన్నదగిన శ్రమ పొందెను ||ప్రియుని|| వందనస్తుడను యేసుని సిలువకు నిందను ఈ భువిన్ భరింతు పరమ గృహమునకు పిలిచెడు దినమున ప్రభుని మహిమను పొందెద ||ప్రియుని||