Second Coming
దివిటీలు మండాలి సిద్దెలలో నూనుండాలి
Diviteelu Mandaali Siddhelalo Noonundaali
దివిటీలు మండాలి - సిద్దెలలో నూనుండాలి
ఈనాటి ఓ సంఘమా - యేసయ్య సహవాసమా
ఇది నిదురించగా సమయమా
నీవు వెనుదిరిగితే న్యాయమా
ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు
ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2)
ఆ ప్రేమ నీడలో - ఆ యేసు బాటలో (2)
మొదటి ప్రేమను మరువకుమా
నిదురించగా సమయమా
వెనుదిరిగితే న్యాయమా
||దివిటీలు||
రాకడ కాలపు సూచనలని చూచాయి
ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి (2)
పరిశుద్ధత కావాలి - పరివర్తన రావాలి (2)
మొదటి ప్రేమను మరువకుమా
నిదురించగా సమయమా
వెనుదిరిగితే న్యాయమా
||దివిటీలు||
