దిక్కులన్ని నీవేలే - దిక్కులన్ని నీవేలే (2)
ఎక్కడో నిన్ను వెదక - ఏలనయ్య ఓ స్వామీ (2)
నిత్యమై నాలోన - జీవమై నీవుండ
||దిక్కులన్ని||
లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా
లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా (2)
నిక్కముగా నర జన్మ - ధన్య చరితాయనే (2)
చక్కనయ్య త్యాగానాన - చావు కూడా సత్తేలే
||దిక్కులన్ని||
దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప
దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా (2)
భాష రాని నా నోట - పాడుకుందు నీ పాట (2)
హీనమైన రూపానాన - గానమై యేసన్న
||దిక్కులన్ని||
