Devotional

దేవుని యందు భక్తి గల స్త్రీ

Devuni Yandu Bhakthi Gala Sthree

Watch on YouTube
దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును ఆమె చేసిన పనులే ఆమెకు - ఘనత నొసంగును ||దేవుని|| ప్రార్ధన చేసి వీర వనితగా ఫలమును పొంది ఘనత పొందెను హన్నా వలె నీవు ప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా ||దేవుని|| ప్రభు పాదములు ఆశ్రయించి ఉత్తమమైనది కోరుకున్నది మరియ వలె నీవు ప్రభు సన్నిధిని కోరెదవా ||దేవుని|| వినయ విధేయతలే సుగుణములై తన జనమును రక్షించిన వనిత ఎస్తేరును బోలి దీక్షను పూణెదవా ఉపవసించెదవా ||దేవుని||