Evangelism

దేవుని ప్రేమ ఇదిగో జనులార

Devuni Prema Idigo Janulaara

Watch on YouTube
దేవుని ప్రేమ ఇదిగో - జనులార - భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనిన - పరలోక - జీవంబు మనకబ్బును ||దేవుని|| సర్వలోకము మనలను - తన వాక్య - సత్యంబుతో జేసెను సర్వోపకారుడుండే - మన మీద - జాలిపరుడై యుండెను ||దేవుని|| మానవుల రక్షింపను - దేవుండు - తన కుమారుని బంపెను మన శరీరము దాల్చెను - ఆ ప్రభువు - మన పాపమునకు దూరుడే ||దేవుని|| యేసు క్రీస్తను పేరున - రక్షకుడు - వెలసి నాడిలలోపల దోసకారి జనులతో - నెంతో సు - భాషలను బల్కినాడు ||దేవుని|| పాప భారంబు తోడ - నే ప్రొద్దు - ప్రయాసముల బొందెడి పాపులందరు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని|| సతులైన పురుషులైనన్ - యా కర్త - సర్వ జనుల యెడలను సత్ప్రేమగా నడిచెను - పరలోక - సద్బోధలిక జేసెను ||దేవుని|| చావు నొందిన కొందరిన్ - యేసుండు - చక్కగా బ్రతికించెను సకల వ్యాధుల రోగులు - ప్రభు నంటి - స్వస్థంబు తా మొందిరి ||దేవుని|| గాలి సంద్రపు పొంగులన్ - సద్దణిపి - నీళ్లపై నడచినాడే మేలు గల యద్భుతములు - ఈలాగు - వేల కొలదిగ జేసెను ||దేవుని|| చేతుల కాళ్లలోను - రా రాజు - చేర మేకులు బొందెను పాతకులు గొట్టినారే - పరిశుద్ధ - నీతి తా మోర్వలేకన్ ||దేవుని|| ఒడలు రక్తము గారగ - దెబ్బలు - చెడుగు లందరు గొట్టిరి వడిముళ్లు తల మీదను - బెట్టిరి - ఓర్చెనో రక్షకుండు ||దేవుని|| ఇన్ని బాధలు బెట్టుచు - దను జంపు - చున్న పాప నరులను మన్నించు మని తండ్రిని - యేసుండు - సన్నుతితో వేడెను ||దేవుని|| రక్షకుడు శ్రమ బొందగా - దేశంబు - తక్షణము చీకటయ్యెన్ రక్షకుడు మృతి నొందగ - తెర చినిగి - రాతి కొండలు పగిలెను ||దేవుని|| రాతి సమాధిలోను - రక్షకుని - నీతిగల దేహంబును పాతి పెట్టిరి భక్తులు - నమ్మిన - నాతు లందరు జూడగా ||దేవుని|| మూడవ దినమందున - యేసుండు - మృతి గెల్చి లేచినాడు నాడు నమ్మిన మనుజులు - చూచిరి - నలువది దినములందున్ ||దేవుని|| పదునొకండు మారులు - వారలకు - బ్రత్యక్షు డాయె నేసు పరలోకమున కేగెను - తన వార్త - బ్రకటించు మని పల్కెను ||దేవుని|| నమ్మి బాప్తిస్మమొందు - నరులకు - రక్షణ మరి కల్గును నమ్మ నొల్లక పోయెడు - నరులకు - నరకంబు సిద్ధమనెను ||దేవుని||