దేవుని వారసులం - ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం - యేసుని దాసులము
నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
హల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
||దేవుని||
సజీవ సిలువ ప్రభు - సమాధి గెలుచుటకే
విజేత ప్రేమికులం - విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్వజముగ సిలువను నిలుపుదుము (2)
||దేవుని||
ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా
విభు మహిమను గాంచ - విశ్వమే మేము గోల
శుభములు గూర్చుచు మాలోన
శోభిల్లు యేసుని చూపుదుము (2)
||దేవుని||
దారుణ హింస లలో - దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో - ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము (2)
||దేవుని||
పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక - బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము జేయుదము (2)
||దేవుని||
అనుదిన కూటములు - అందరి గృహములలో
ఆనందముతోను - ఆరాధనలాయే
వీనుల విందగు పాటలతో
ధ్యానము చేయుచు మురియుదము (2)
||దేవుని||
హత సాక్షుల కాలం - అవనిలో చెలరేగ
గతకాలపు సేవ - గొల్గొతా గిరి జేర
భీతులలో బహు రీతులలో
నూతన లోకము కాంక్షింతుము (2)
||దేవుని||
