దేవుని సముఖ జీవ కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా
||దేవుని||
జీవవాక్యము ఇలలో చాటుచు - జీవితము లర్పించిరే (2)
హత సాక్షుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా
||దేవుని||
ఆకాశమండలములలో తిరిగెడు - అంధకార శక్తులను గెలిచిన (2)
విజయవీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా
||దేవుని||
పరిశుద్ధ యెరుషలేము సంఖ్య - పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
సర్వోన్నతుని పురములలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా
||దేవుని||
దేవుని సన్నిధి మహిమ ధననిధి - దాతను వేడి వరము పొందిన (2)
ప్రార్ధన వీరుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా
||దేవుని||
పరమునుండి ప్రభువు దిగగా - పరిశుద్ధులు పైకెగయునుగా (2)
పరిశుద్ధుల కవిలెలో (2)
నీ పేరున్నదా - నీ పేరున్నదా
||దేవుని||
