Thanksgiving

దేవుని స్తుతించ రండి

Devuni Sthuthincha Randi

Watch on YouTube
దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున కాపాడెన్ కీడు మనలను చేరకను - కోటి కీడుల నుండి కాపాడినట్టి - మహా ||దేవుని|| కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము కష్టముల బాపి మనల నింక జగమున జీవితులుగా నుంచినట్టి - మహా ||దేవుని|| ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మెల్లను చేసెనుగా నిరతము కాచి చక్కగాను ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి ||దేవుని|| ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఆత్మ దేహములను బలిగా నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి ||దేవుని|| వత్సారంభముననిను మే మొక్కటిగా నారాధింప దైవ కుమారా కృపనిమ్ము మా జీవిత కాలమంతయు పాడి - మహా ||దేవుని|| భూమి యందలి మాయల నుండి సైతానుని వలలో నుండి ఆత్మతో నిను సేవింప నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి ||దేవుని|| ప్రతి సంవత్సరమును మము జూడుము దుర్గములో మము చేర్చుమయ్యా దాటునప్పుడు నీ సన్నిధిని - చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా - మహా ||దేవుని|| స్తోత్రింతుము ప్రభువా నీ పదముల సకలాశీర్వాదముల నిమ్ము ప్రేమతో ప్రభుతో నుండ నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ - ప్రభు ||దేవుని||