దేవుని స్తుతించ రండి
గత సంవత్సరమున కాపాడెన్
కీడు మనలను చేరకను - కోటి
కీడుల నుండి కాపాడినట్టి - మహా
||దేవుని||
కోట్లకొలది మరణించిరి
మన మిచ్చట చేరియున్నాము
కష్టముల బాపి మనల నింక
జగమున జీవితులుగా నుంచినట్టి - మహా
||దేవుని||
ఎన్ని కీడుల మనము చేసిన
నన్ని మెల్లను చేసెనుగా
నిరతము కాచి చక్కగాను
ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి
||దేవుని||
ఏకముగా పాడి హర్షముతో
లెక్కలేని మేలులకై
ఆత్మ దేహములను బలిగా
నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి
||దేవుని||
వత్సారంభముననిను
మే మొక్కటిగా నారాధింప
దైవ కుమారా కృపనిమ్ము
మా జీవిత కాలమంతయు పాడి - మహా
||దేవుని||
భూమి యందలి మాయల నుండి
సైతానుని వలలో నుండి
ఆత్మతో నిను సేవింప
నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి
||దేవుని||
ప్రతి సంవత్సరమును మము జూడుము
దుర్గములో మము చేర్చుమయ్యా
దాటునప్పుడు నీ సన్నిధిని - చూపి
ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా - మహా
||దేవుని||
స్తోత్రింతుము ప్రభువా నీ పదముల
సకలాశీర్వాదముల నిమ్ము
ప్రేమతో ప్రభుతో నుండ
నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ - ప్రభు
||దేవుని||
