దేవుడే నాకాశ్రయంబు - దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల - సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ
||దేవుడే||
పర్వతములు కదిలిన నీ - యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ - సంద్ర ముప్పొంగినన్
||అభయ||
దేవుడెప్డు తోడుగాగ - దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల - ధన్యులై వసింతురు
||అభయ||
రాజ్యముల్ కంపించిన భూ - రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి - బూని సంహరించును
||అభయ||
విల్లు విరచు నాయన తెగ - బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల - నెల్లద్రుంచు నాయనే
||అభయ||
పిశాచి పూర్ణ బలము నాతో - బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవు - నాజ్ఞ వలన మడియును
||అభయ||
కోటయు నాశ్రయమునై యా - కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు - నెప్డు నాకు బండుగ
||అభయ||
