Second Coming

దేవుడొక నగరము మన కొరకై

Devudoka Nagaramu Mana Korakai

Watch on YouTube
దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండె నుండుటకై (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా (2) ||దేవుడొక|| మేలిమి బంగారము అద్భుత నగరం విలువైన రాళ్ళతో పునాది వేసెను (2) రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా - నిశ్చయముగా (2) ||దేవుడొక|| నగర ప్రాకారములు ఎత్తైనవి సూర్య కాంతములచే కట్టబడెను (2) ప్రభువే విమోచించి అధికారమిచ్చెను (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా - నిశ్చయముగా (2) ||దేవుడొక|| ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి (2) పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా - నిశ్చయముగా (2) ||దేవుడొక|| ఆ నగర వీధులు మేలిమి బంగారం ద్వారములు ఎప్పటికి మూయబడవు (2) ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా - నిశ్చయముగా (2) ||దేవుడొక|| గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును ఆయనే దీపము నాలయమై యుండును (2) జీవగ్రంథమందున పేరులున్నవనుచు (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా - నిశ్చయముగా (2) ||దేవుడొక|| జయవంతుల కొరకే ఆ నగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు (2) విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా - నిశ్చయముగా (2) ||దేవుడొక||