దేవా నా మొరాలకించితివి
నాకభయము నిచ్చితివి
నాకెంత సంతోషము
||దేవా||
కనికరించి నా మొరను - ఆలకించితివి
యేసు దేవా నిన్ను చేర - మార్గము చూపితివి (2)
స్తోత్రము చేయుదు హల్లెలూయని
నా జీవిత కాలమంతా (2)
నా జీవిత కాలమంతా…
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా…
||దేవా||
కృశించిపోయిన నా ఆత్మకు నీవు - జీవమిచ్చితివి
నా హృదయమున చీకటిమయమును - వెలుగుతో నింపితివి (2)
నీ కృపాతిశయమును నిత్యము
కీర్తింతునో ప్రభువా (2)
కీర్తింతునో ప్రభువా….
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా…
||దేవా||
