దేవా నా హృదయముతో
నిన్నే నేను కీర్తింతును (2)
మారని ప్రేమ నీదే (2)
నిన్ను కీర్తింతును ఓ.. ఓ..
నిన్ను కొనియాడెద
||దేవా||
ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా
నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2)
నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆలాపన
నీ కోసమే నీ కోసమే - నా ఈ ఆరాధన
||మారని||
నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా
పరలోక రాజ్యములో పరవశించాలని (2)
నీ కోసమే నీ కోసమే - నా ఈ నిరీక్షణ (2)
||మారని||
