Christmas

క్రిస్మస్ కాలం క్రీస్తు జననం

Christmas Kaalam Kreesthu Jananam

Watch on YouTube
క్రిస్మస్ కాలం క్రీస్తు జననం - ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభువుల ప్రభువు - ధరకేతెంచెలే (2) ఎంతో ఆనందమే - రారాజు నీ జన్మమే ఎంతో సంతోషమే - ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం|| పరిశుధ్ధుడు జన్మించెను - పశువుల పాకలో లోకాలనేలే రారాజుగా - ఆ బెత్లేహేములో (2) యూదా గోత్రములో - ఒకతార కాంతిలో (2) ||క్రిస్మస్ కాలం|| కాపరులు చాటించిరి - లోకాన శుభవార్తను బంగారు సాంబ్రాణి బోళములు - అర్పించిరి జ్ఙానులు (2) దూతలు స్త్రోత్రించిరి - ఆ ప్రభుని ఘనపరచిరి (2) ||క్రిస్మస్ కాలం|| ఆ ప్రభువు జన్మించెను - నరరూపధారిగా మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా ఆ ప్రభువు జన్మించెను - నరరూపధారిగా మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా (2) ఎంతో ఆనందమే - రారాజు నీ జన్మమే ఎంతో సంతోషమే - ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం||