చాటించుడి మనుష్యజాతి కేసు నామము
చాటించుడి యవశ్యమేసు - ప్రేమసారము
జనాదులు విశేష రక్షణ సునాదము - విను పర్యంతము
చాటుదాము చాటుదాము - చాటుదాము చాటుదాము
చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము
కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో
నెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతో
మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో
చాటుదాము చాటుదాము - చాటుదాము చాటుదాము
చాటుదాము చాటుదాము - చక్కని మార్గము
సమీపమందు నుండునేమో చావు కాలము
సదా నశించిపోవువారికీ సుభాగ్యము
విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందము
చాటుదాము చాటుదాము - చాటుదాము చాటుదాము
చాటుదాము చాటుదాము - సత్య సువార్తను
