Encouragement

భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు

Bhayamu Chendaku Bhakthudaa Ee Maaya Loka Chaayalu Choochinappudu

Watch on YouTube
భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2) భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు (2) జీవమిచ్చిన యెహొవున్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము|| బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందునా (2) పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2) నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా నాల్గవ వాడు ఉండలేదా ||భయము|| చెరసాలలో వేసినా తన దేహమంతా గాయాలతో నిండినా (2) పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2) భూకంపం కలుగ లేదా ఆ భక్తులు ముగ్గురు చెరనుండి విడుదల కాలేదా ||భయము|| ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండినా (2) అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2) అని యోబు పలుక లేదా ఓ భక్తుడా అని యోబు పలుక లేదా ||భయము||