అరుణ కాంతి కిరణమై
కరుణ చూప ధరణిపై
నరుని రూపు దాల్చెను
పరమ దేవ తనయుడు
అదే అదే క్రిస్మస్ - హ్యాపీ క్రిస్మస్
ఇదే ఇదే క్రిస్మస్ - మెర్రీ క్రిస్మస్
||అరుణ||
యజ్ఞ యాగాదులు - బలి కర్మకాండలు (2)
దోషంబులు కడుగలేవు
దోషుల రక్షింప లేవు (2)
పరిశుద్ధుని రక్తమునందే
పాపులకిల ముక్తి కలుగును
అందుకే.. అందుకే
||అరుణ||
పుణ్య కార్యములు - మరి తీర్థయాత్రలు (2)
దోషంబులు కడుగలేవు
దోషుల రక్షింప లేవు (2)
పరిశుద్ధుని రక్తమునందే
పాపులకిల ముక్తి కలుగును
అందుకే.. అందుకే
||అరుణ||
