అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే (2)
మృతతుల్యమైన శారా గర్భమును - జీవింపచేసిన నీకే
నిరీక్షణే లేని నా జీవితానికి - ఆధారమైన నీకే (2)
ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు
అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2)
||అయ్యా||
అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో - ఆనందమిచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు - నిరీక్షణనిచ్చిన నీకే (2)
కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా
జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2)
||అయ్యా||
