Faith

అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే

Anni Saadhyame Yesuku Annee Saadhyame

Watch on YouTube
అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2) అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే|| మాధుర్యమైన జలముగా - మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును - మాహిమార్థముకై లేపెను (2) మన్నాను కురిపించగా - ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా - మృత్యుంజయుడై లేచెను (2) ||అన్నీ సాధ్యమే|| బండనే చీల్చగా - జలములే పొంగెను ఎండిపోయిన భూమిపై - ఏరులై అవి పారెను (2) బందంటే క్రీస్తేనని - నీ దండమే తానని మెండైన తన కృపలో - నీకండగా నిలచును (2) ||అన్నీ సాధ్యమే|| ఏకాంతముగా మోకరిల్లి - ప్రార్ధించుటే శ్రేయము ఏల నాకీ శ్రమలని - పూర్ణ మనసుతో వేడుము (2) యేసయ్య నీ వేదన - ఆలించి మన్నించును ఏ పాటి వ్యధలైననూ - ఆ సిల్వలో తీర్చును (2) ||అన్నీ సాధ్యమే|| కష్టాల కడలిలో - కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును - కంటిపాపలా కాయును (2) కలిగించు విశ్వాసము - కాదేదీ అసాధ్యము క్రీస్తేసు నామములో - కడగండ్లకే మోక్షము (2) ||అన్నీ సాధ్యమే||