Hymns

అన్యజనులేల లేచి గల్లత్తు చేయుచున్నారు

Anyajanulela Lechi Gallatthu Cheyuchunnaru

Watch on YouTube
అన్యజనులేల లేచి గల్లత్తు చేయు-చున్నారు - అన్యజనులేల జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి (2) ||అన్యజనులేల|| భూలోక రాజులు లేచి వారేకముగా ఆలోచించి - భూలోక రాజులు వారి పాశములను తెంపి పారవేయుద మనుచున్నారు (2) ||అన్యజనులేల|| ఆకాశ వాసుండు వారిని అపహసించుచున్నాడు నవ్వి - ఆకాశ వాసుండు వారలతో పల్కి కోపముతో వారిని తల్లడిల్ల చేయును (2) ||అన్యజనులేల|| పరిశుద్ధమైన నాదు పర్వతమగు సీయోను మీద - పరిశుద్ధమైన నారాజు నాసీనునిగా జేసి యున్నానని సెలవిచ్చెను (2) ||అన్యజనులేల|| కట్టడ వివరింతు నాకు యిట్లు చెప్పెను యెహోవాయందు - కట్టడ వివరింతు నీవు నా కుమారుడవు నిన్ను నేను కనియున్నాను (2) ||అన్యజనులేల|| నన్ను అడుగుము నీకు జనముల భూమిని స్వాస్థ్యముగా - నన్ను అడుగుము దిగంతముల వరకు స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2) ||అన్యజనులేల|| ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు - ఇనుప దండముతో కుండను పగులగొట్టునట్లు వారిని పగులగొట్టెదవు (2) ||అన్యజనులేల|| ఓ రాజులారా మీరు జ్ఞానవంతులై యుండుడి - ఓ రాజులారా ఓ భూపతులారా మీరు నాభోద నొందుడి నేడే (2) ||అన్యజనులేల||