అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే (2)
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)
||అన్నీ సాధ్యమే||
మాధుర్యమైన జలముగా - మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును - మాహిమార్థముకై లేపెను (2)
మన్నాను కురిపించగా - ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా - మృత్యుంజయుడై లేచెను (2)
||అన్నీ సాధ్యమే||
బండనే చీల్చగా - జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై - ఏరులై అవి పారెను (2)
బందంటే క్రీస్తేనని - నీ దండమే తానని
మెండైన తన కృపలో - నీకండగా నిలచును (2)
||అన్నీ సాధ్యమే||
ఏకాంతముగా మోకరిల్లి - ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని - పూర్ణ మనసుతో వేడుము (2)
యేసయ్య నీ వేదన - ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ - ఆ సిల్వలో తీర్చును (2)
||అన్నీ సాధ్యమే||
కష్టాల కడలిలో - కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును - కంటిపాపలా కాయును (2)
కలిగించు విశ్వాసము - కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో - కడగండ్లకే మోక్షము (2)
||అన్నీ సాధ్యమే||
