Praise

అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా

Amoolya Rakthamu Dvaaraa Rakshana Pondina Janulaaraa

Watch on YouTube
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము మన యవ్వన జీవితములు - శరీరాశకు లోబరచి (2) చెడు మాటలను పలుకుచు - శాంతి లేక యుంటిమిగా (2) ||అమూల్య|| చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము (2) నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి (2) ||అమూల్య|| నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక (2) స్వంత నీతి తోడనే - దేవుని రాజ్యము కోరితిమి (2) ||అమూల్య|| కనికరముగల దేవుడు - మానవరూపము దాల్చెను (2) ప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను (2) ||అమూల్య|| తన రక్త ధారలలో - మన పాపములను కడిగి (2) మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో (2) ||అమూల్య|| పాపులమైన మన మీద - తన యాశ్చర్య ఘన ప్రేమ (2) కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము (2) ||అమూల్య|| మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా (2) మన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములను (2) ||అమూల్య||