Thanksgiving

అమూల్యమైన ఆణిముత్యమా

Amoolyamaina Aanimuthyamaa

Watch on YouTube
అమూల్యమైన ఆణిముత్యమా యెహోవ దేవుని హస్తకృతమా (2) అపురూప సౌందర్య రాశివి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు (2) ||అమూల్యమైన|| జ్ఞానము కలిగి నోరు తెరచుదువు కృపగల ఉపదేశమును చేయుదువు (2) ఇంటివారిని బాగుగ నడుపుచూ వారి మన్ననలను పొందుచుందువు (2) ||అమూల్యమైన|| చేతులతో బలముగా పనిచేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు (2) రాత్రివేళ నీ దీపము ఆరదు కాంతికిరణమై మాదిరి చూపుదువు (2) ||అమూల్యమైన|| దీనులకు నీ చేతులు పంచును దరిద్రులను నీవు ఆదుకొందువు (2) దూరము నుండి ఆహారము కొనుచు మంచి భోజనముతో తృప్తిపరచుదువు (2) ||అమూల్యమైన||