Worship

అల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా

Alpha Omegayaina Mahimaanvithudaa

Watch on YouTube
అల్ఫా ఒమేగయైన - మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా - నిరంతరం స్తోత్రార్హుడా (2) రాత్రిలో కాంతి కిరణమా - పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమై నా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా (2) ||అల్ఫా|| కనికర పూర్ణుడా - నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నిను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను (2) జీవించెద నీ కొరకే హర్షించెద నీలోనే (2) ||అల్ఫా|| తేజోమయుడా - నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నను చేసెను (2) నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే (2) ||అల్ఫా|| నిజస్నేహితుడా - నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను (2) నా చెలిమి నీతోనే నా కలిమి నీలోనే (2) ||అల్ఫా||