Thanksgiving

అర్హత లేకున్న ప్రేమించావు

Arhatha Lekunna Preminchaavu

Watch on YouTube
అర్హత లేకున్న ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్న హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే (2) కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే (2) లోకమునన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టుచేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే (2) ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య (2) నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2) ||కృపయే కృపయే|| శ్రమలు శోదనలు నన్నావరింపగా అజ్ఞానముచే నే హీనమవ్వగా మరణపు కొరలు నా చుట్టు చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే (2) ఇంతగ నన్ను ప్రేమించుటకు ఏ పాటివాడను యేసయ్య (2) నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2) ||కృపయే కృపయే||