Worship
ఏ రీతి స్తుతియింతునో ఏ రీతి సేవింతునో
Ae Reethi Stuthiyinthuno Ae Reethi Sevinthuno
ఏ రీతి స్తుతియింతునో ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా నాదు గలలీయుడా
ఏ రీతి స్తుతియింతునో…
నా ప్రాణ నాధుండా నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా (2)
||ఏ రీతి||
మహిమ నగరిని విడిచితివి మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడచితివి సేవకునిగా మారితివి (2)
||నా ప్రాణ||
వెదకి నను ఇల చేరితివి వెంబడించగ పిలచితివి
రోత బ్రతుకును మార్చితివి నీదు సుతునిగ జేసితివి (2)
||నా ప్రాణ||
ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్న తరమా నీ ప్రేమ సన్నుతించుచు పాడెదను (2)
||నా ప్రాణ||
