Worship

ఏ రీతి స్తుతియింతును ఓ యేసూ నాథా దైవమా

Ae Reethi Stuthiyinthunu O Yesu Naathaa Daivamaa

Watch on YouTube
ఏ రీతి స్తుతియింతును ఓ యేసూ నాథా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును నీ కృపలన్ని తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి|| ఏకాకినై నే దుఃఖార్తిలో ఏ తోడు గానని నాకు ఏమౌదునో ఎటు పోదునో ఎటు తోచక నున్న నన్ను ఏ భయము నీకేల యనుచు అభయంబు నిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి|| ఈ మనుష్యులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనంభేగదయ్యా నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగ నిలిచావయ్యా నాకేమి స్పృహ లేని వేళ ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి|| నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను నిజ దైవము నీవే యనుచు నీ వైపే నే చూచానయ్యా యెహోవా రాఫా నేననుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||