Praise

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా

Ae Baadha Ledu Ae Kashtam Ledu Yesu Thodundaga

Watch on YouTube
ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) ||ఏ బాధ|| ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డొచ్చినా సాతాను శోధించినా శత్రువులే శాసించినా పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా ||దిగులేల|| పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా తుఫానులు చెలరేగినా వరదలు ఉప్పొంగినా కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా ||దిగులేల||