Worship

ఏ పాపమెరుగని యో పావన మూర్తి

Ae Paapamerugani Yo Paavana Murthi

Watch on YouTube
ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా ముళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సోమ్మ సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప|| కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా ||ఏ పాప|| చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకు కల్వరి గిరి కడ కేగి సిల్వను గ్రక్కున దించినావా ||ఏ పాప|| ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప|| పలువిధంబుల శ్రమలు చెలరేగ దండ్రికి నెలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయెనా ||ఏ పాప|| బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్క జిల్లి బడ బొడచినాడా ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప|| కట కటా పాప సంకటము బాపుట కింత పటు బాధ నొందినావా ఎటువంటిదీ ప్రేమ యెటువంటిదీ శాంత మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||