ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ (2)
||ఆశ్చర్యమైన||
పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే
||ఆశ్చర్యమైన||
పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే
||ఆశ్చర్యమైన||
శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు
||ఆశ్చర్యమైన||
నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే
||ఆశ్చర్యమైన||
