ఆశ్చర్యాకరుడా
నా ఆలోచన కర్తవు (2)
నిత్యుడగు తండ్రివి
నా షాలేము రాజువు (2)
సింహపు పిల్లలైనా
కొదువ కలిగి ఆకలిగొనినా (2)
నీ పిల్లలు - ఆకలితో అలమటింతురా
నీవున్నంతవరకు (2)
||ఆశ్చర్యాకరుడా||
విత్తని పక్షులను
నిత్యము పోషించుచున్నావు (2)
నీ పిల్లలు - వాటికంటే శ్రేష్టులే కదా
నీవున్నంతవరకు (2)
||ఆశ్చర్యాకరుడా||
చీకటి తొలగే
నీతి సూర్యుడు నాలో ఉదయించె (2)
నీ సాక్షిగా - వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు (2)
||ఆశ్చర్యాకరుడా||
