Praise
ఆరాధించెదం ఆర్భాటించెదం యేసుని సన్నిధిలో
Aaraadhinchedam Aarbhaatinchedam Yesuni Sannidhilo
ఆరాధించెదం ఆర్భాటించెదం - యేసుని సన్నిధిలో
ఆనందించెదం మరల ఆనందించెదం - దేవుని సన్నిధిలో
సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదం
జిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము
యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా
యెరికో కోట గోడలన్ని కూలిపోయే - కాలిపోయే
ఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా - ఆర్భాటించగా
స్తుతులపై ఆసీనుడా యేసయ్యా
మా ప్రార్ధనలు ఆలకించువాడా
స్తుతియాగము చేయు వాడే
నిన్ను మహిమ పరచు వాడు
||యేసయ్యా||
యూదా దేశము మీదికి శత్రు సైన్యము - దండెత్తగా
యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా - స్తోత్రము చేయగా
దేవుడే యుద్ధము జరిపెను
అద్భుత జయమును పొందిరి
బెరాకా లోయలో కూడిరి
కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి
||యేసయ్యా||
