ఆరాధనా ఆరాధనా - ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)
నీకే నా దేవా - తండ్రీ అందుకోవా (2)
||ఆరాధనా||
అన్నిటికీ ఆధారమైనవాడా - నీకే ఆరాధనా (2)
ఎన్నటికీ మారని మంచివాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)
||నీకే||
నోటను కపటము లేనివాడా - నీకే ఆరాధనా (2)
మాటతో మహిమలు చేయువాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)
||నీకే||
అంతయు వ్యాపించియున్నవాడా - నీకే ఆరాధనా (2)
చింతలు తీర్చేటి గొప్పవాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)
||నీకే||
