Worship

ఆనందం నీలోనే ఆధారం నీవేగా

Aanandam Neelone Aadhaaram Neevegaa

Watch on YouTube
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా - స్తోత్రార్హుడు అర్హతేలేని నన్ను - ప్రేమించినావు జీవింతు ఇలలో - నీ కోసమే - సాక్ష్యార్థమై ||ఆనందం|| పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2) కలవరాల కోటలో - కన్నీటి బాటలో (2) కాపాడే కవచంగా - నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా - స్తోత్రగీతమా ||ఆనందం|| నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని (2) నీ సన్నిధి వీడక - సన్నుతించి పాడనా (2) నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా సత్యవాక్యమే - జీవవాక్యమే ||ఆనందం|| సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై (2) లోక మహిమ చూడక - నీ జాడలు వీడక (2) నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం - నా ఆశయం ||ఆనందం||