Praise

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర

Aananda Yaathra Idi Aathmeeya Yaathra

Watch on YouTube
ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర మన యేసుతో నూతన యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర|| యేసుని రక్తము పాపములనుండి విడిపించెను (2) వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర|| రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా (2) మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర|| కృతజ్ఞత లేని వారు వేలకొలదిగ కూలినను (2) కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర|| ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||