ఆనందం నీలోనే - ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా - స్తోత్రార్హుడు
అర్హతేలేని నన్ను - ప్రేమించినావు
జీవింతు ఇలలో - నీ కోసమే - సాక్ష్యార్థమై
||ఆనందం||
పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో - కన్నీటి బాటలో (2)
కాపాడే కవచంగా - నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా - స్తోత్రగీతమా
||ఆనందం||
నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీ సన్నిధి వీడక - సన్నుతించి పాడనా (2)
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే - జీవవాక్యమే
||ఆనందం||
సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై (2)
లోక మహిమ చూడక - నీ జాడలు వీడక (2)
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం - నా ఆశయం
||ఆనందం||
