Worship

ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా

Aakarshinche Priyuda Andamaina Daivama

Watch on YouTube
ఆకర్షించే ప్రియుడా... అందమైన దైవమా... ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైనవాడా (4) నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది (2) నీదు ప్రేమ చేతులు - ప్రేమించే చేతులు (2) నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2) ||ఆకర్షించే|| నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2) నీదు ప్రేమ పాదం - పరిశుద్ధ పాదం (2) అదియే నేను వసియించే స్థలము (2) ||ఆకర్షించే|| నిన్ను పాడి హృదయం ఆనందించును నాట్యంతో పాటలు పాడెదను (2) దేవాది దేవుడని - ప్రభువుల ప్రభువని (2) అందరికి నిన్ను చాటి చెప్పెదను (2) ||ఆకర్షించే||