ఆగని పరుగులో ఎండిన ఎడారులు (2)
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
ఉన్నపాటునా నలిగె నా వైపున
కదలిరాలేవా ఆదరించగ రావా
కన్నీరే నా మజిలీ - దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ - నా ప్రాణమై
కరుణించే నీ చూపు - మన్నించే నా మనవి
అందించే నీ చేయి - నా స్నేహమై
||ఆగని||
లోకప్రేమే సదా - కలల కడలే కదా
తరంగమై కావుమా - తిరిగి తీరమునకు (2)
నీవే కదా ఆధారం - సదా నీకే దాసోహం
యేసయ్యా… అర్పించెదా - నా జీవితం
||ఆగని||
ఎదుట నిలిచె నీవే - ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా - జార విడువకు నన్ను (2)
నీవే కదా నా మూలం - సదా నీపై నా భారం
యేసయ్యా… ప్రేమించెదా - కలకాలము
||ఆగని||
