Evangelism

యేసుని ప్రేమ యేసు వార్త

Yesuni Prema Yesu Vaartha

Watch on YouTube
యేసుని ప్రేమ యేసు వార్త వాసిగ చాటను వెళ్ళెదము ఆశతో యేసు సజీవ సాక్షులై దిశలన్నిటను వ్యాపించెదము వినుము ప్రభుని స్వరము (2) ప్రభు యేసు సన్నిధి తోడు రాగా కడుదూర తీరాలు చేరెదము ||యేసుని|| మరణ ఛాయ లోయలలో నాశన కూపపు లోతులలో (2) చితికెను బ్రతుకులెన్నో (2) ప్రేమ తోడను చేరి వారిని ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని|| కాపరి లేని గొర్రెలుగా వేసారెనుగ సమూహములే (2) ప్రజలను చూచెదమా (2) ప్రేమ తోడను చేరి వారిని ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని||