Faith

యేసు ఉంటే చాలు నా జీవితం ధన్యము

Yesu Unte Chaalu Naa Jeevitham Dhanyamu

Watch on YouTube
యేసు ఉంటే చాలు నా జీవితం ధన్యము (2) ఆయనే నా సర్వము ఆయనే నా కేడెము అయనే నా స్వాస్థ్యము (2) ||యేసు|| ఎడారిలో నే వెళ్లిన – యేసు ఉంటే చాలు ఆలలే నా వైపు ఎగసి – యేసు ఉంటే చాలు (2) ఆయనే నా మార్గము ఆయనే నా సత్యము ఆయనే నా జీవము (2) ||యేసు|| ఆపవాది నాపైకి వచ్చిన – యేసు ఉంటే చాలు లోకము నను త్రోసివేసిన – యేసు ఉంటే చాలు (2) ఆయనే నా శైలము ఆయనే నా ధైర్యము ఆయనే నా విజయము (2) ||యేసు||