Passion

యేసయ్యా యేసయ్యా నీదెంత జాలి మానసయ్యా

Yesayyaa Yesayyaa Needhentha Jaali Maanasayyaa

Watch on YouTube
యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యా యేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యా నిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులే కందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి ||యేసయ్యా|| ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహం అయ్యో.. ఆరిపోవు దీపం అయినా రాదు నీకు కోపం గుండెలోన కరుణ – కళ్ళలోన పొంగి జారే కన్నీళ్లు మాత్రం పాపం చేసినోల్ల కోసం ||యేసయ్యా|| నమ్మినోల్ల పాపం – మోసినావు పాపం నిను మోసి కట్టుకుంది పుణ్యం ఆహా సిలువదెంత భాగ్యం ఓడిపోయి మరణం – సాక్ష్యమిచ్చుఁ తరుణం మళ్ళీ లేచి వచ్చుఁ నిన్నే చూసిన వారి జన్మ ధన్యం ||యేసయ్యా||