Encouragement

యేసే నీ మదిలో ఉండగా

Yese Nee Madhilo Undagaa

Watch on YouTube
యేసే నీ మదిలో ఉండగా కలతే దరి చేరగ రాదుగా (2) సోదరా సోదరీ.. యేసులో నెమ్మది ఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది ||యేసే|| తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినా ఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా (2) నీ చెంతకు చేరి నిలుపును నీ చింతను తీర్చి నడుపును (2) సోదరా సోదరీ.. యేసే నీ మాదిరి సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి (2) ||యేసే|| సిలువపైన బలిగా మారి నిన్ను ప్రేమించెగా సహింపలేని శోధనలను నీకు దయచేయునా (2) శోధనలను గెలిచే మార్గము తప్పక నీకొసగును తథ్యము (2) సోదరా సోదరీ.. యేసులో విజయము సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నమ్మకం (2) ||యేసే||