Worship

తండ్రీ దేవా తండ్రీ దేవా

Thandri Devaa Thandri Devaa

Watch on YouTube
తండ్రీ దేవా… తండ్రీ దేవా… నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు (2) నా ప్రియుడా నా ప్రాణమా - నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా - నిన్నారాధించెదన్ (2) ||తండ్రీ|| నీ ప్రేమ వర్ణించుట - నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట - నా బ్రతుకు చాలదయ్యా (2) తండ్రీ దేవా… నా ఆనందమా… నీ ఒడిలో నాకు సుఖము (2) నా ప్రాణ స్నేహితుడా - నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా - నీ ప్రేమ మధురమయ్యా (2) తండ్రీ దేవా… నా ఆనందమా… నీ ఒడిలో నాకు సుఖము (2)