Christmas
సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
Santhoshinchudi Yandaru Naatho Santhoshinchudi
సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి
యొక వింతగు కీర్తన బాడ వచ్చితిని
సంతోషించుడి నాతో సంతోషించుడి
||సంతోషించుడి||
అంధకార మయమైన భూమి నా
ద్యంతము వెలిగింప - దాని యా-వేశము దొలఁగింప
వందితుండు క్రీస్తేసు నాథుడు - వచ్చె బ్రకాశుండై
భూమికి నిచ్చె ప్రకాశంబు
||సంతోషించుడి||
కాన నంధకారంబు దొలఁగఁ ప్ర
కాశించెను లెండు - మీరు ప్ర-కాశింపను రెండు
మానవులను సంతోష పర్చనై - మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె
||సంతోషించుడి||
మిన్ను నుండి సంతోషోదయము
మిగుల ప్రకాశించె - హృదయములఁ - దగుల ప్రకాశించె
మున్ను జేయబడిన వాగ్ధత్థము - తిన్నగ నెరవేరే
భక్తుల కన్ను లాస దీరె
||సంతోషించుడి||
ప్రీతియైన నీ పండుగ గూర్చి
నూతన కీర్తనను - గలసికొని - నాతో పాడుచును
నీ తరి దూరస్థుల-కీ వార్తను - నే తీరును నైనఁ
దెలుపఁగ నాతురపడవలెను
||సంతోషించుడి||
పాపులపై దేవునికి గలిగిన
ప్రబలమైన దయను - లోకమునఁ - జూపింపఁ గవలెను
జూపక పోయిన లోపము మనపై - మోపబడును నిజము
వేగము జూపుద మా పథము
||సంతోషించుడి||
